ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌లో 'తమిళ్‌ డే'

- January 18, 2018 , by Maagulf
ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌లో 'తమిళ్‌ డే'

ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌ (ఐఎస్‌బి), 'తమిళ్‌ డే' వేడుకల్ని ఇసా టౌన్‌లోని తన క్యాంపస్‌లో జనవరి 14న ఘనంగా నిర్వహించింది. భారతదేశంలోని తమిళనాడులో నాలుగు రోజులపాటు జరిగే పొంగల్‌ ఫెస్టివల్‌ని స్కూల్‌కి చెందిన తమిళ డిపార్ట్‌మెంట్‌ 'తమిళ్‌ డే' పేరుతో ఘనంగా నిర్వహించింది. హారతి తమిళ సంగమ్‌ ఫౌండర్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌ మాలిమ్‌, భారతి తమిళ్‌ సంఘం ఫార్మర్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ ఖయ్యిమ్‌, ఐఎస్‌బి ఇసి మెంబర్‌ ప్రేమలత, ప్రిన్సిపల్‌ విఆర్‌ పలనిస్వామి, స్టాఫ్‌ రిప్రెజెంటేటివ్‌ జాన్సన్‌ కె దెవాస్సి, వైస్‌ ప్రిన్సిపల్స్‌, హెడ్‌ టీచర్స్‌, స్టూడెంట్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహ్రెయిన్‌, ఇండియా జాతీయ గీతాలతో, స్కూల్‌ ప్రేయర్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. మ్యాథ్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ బి.సెంథిల్‌ అతిథులకు ఆహ్వానం పలికారు. తమిళ భాషలోని మాధుర్యం గురించి ప్రేమలత వివరించారు. హాజి పాల్‌, శ్రీకాంత్‌ (హెడ్‌ టీచర్స్‌ ఆఫ్‌ యాక్టివిటీస్‌), తమిళ ఈచర్‌ రెజి జాబ్‌ ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్‌ చేశారు. 4, 5 తరగతులకు చెందిన విద్యార్థులు ఇన్వోకేషన్‌ డాన్స్‌ని ప్రదర్శించారు. 6, నుండి 8 తరగతుల విద్యార్థులు తమిళ స్కిట్‌ని ప్రదర్శించడం జరిగింది. 4 నుంచి 12 తరగతులకు చెందిన విద్యార్థులు తమిళ సాంగ్స్‌ని ప్రెజెంట్‌ చేశారు. వివిధ కాంపిటీషన్స్‌లో విజయం సాధించినవారికి బహుమతులు అందజేశారు. పిఇటి డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ఆర్‌.చిన్నస్వామి వోట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com