కింగ్ ఫిషర్ కేసులో మాల్యాకు అరెస్ట్ వారెంట్
- January 18, 2018
వేలకోట్ల రూపాయల ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్‌మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో బెంగళూరులోని కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కోర్టు మాల్యాతోపాటు మరో 18మందికి ఈ వారెంట్ ఇష్యూ చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఐఎఫ్ఓఓ) దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఈ చర్య తీసుకుంది.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని దర్యాప్తు సంస్థ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి పలు కంపెనీల చట్టాల ఉల్లంఘనలను గుర్తించింది. దీంతోపాటు తీవ్రమైన కార్పొరేట్ పాలన లోపాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో చోటుచేసుకున్న అక్రమాల మొత్తం భారీగా ఉండటంతో మాల్యా సహా అందరి నిందితులపై కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఈ నేపథ్యంలోనే కంపెనీల చట్టాల ప్రకారం డిఫాల్టర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, మరో 18 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతేకాకుండా, 19 సంస్థలపై "ప్రత్యేక నేర కేసు" నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ తమ చార్జ్‌షీటులను దాఖలు చేశాయి. కాగా 9వేలకోట్ల రూపాయల మేర రుణాలను ఎగవేసిన మాల్యా లండన్‌కు పారిపోగా.. ఆయన్ను తిరిగి భారత్‌కు రప్పించేందుకు సంబంధించిన కేసు లండన్ కోర్టు విచారణలో ఉంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







