జనవరి 26 న విడుదల కానున్న 'ఆచారి అమెరికా యాత్ర'
- January 19, 2018
విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానున్నది. కామెడీ ప్రధానంగా సాగే టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన 'స్వామి రా రా' అనే బీట్ ప్రధానంగా సాగే పాట ప్రేక్షకుల చేత స్టెప్పులేయించెలా ఉండగా, సంక్రాంతి నాడు విష్ణు విడుదల చేసిన మరో పాట 'చెలియా' సంగీత ప్రియులను అలరిస్తోంది.
అచ్చు రాజమణి సంగీతం సమకూర్చిన ఈ రొమాంటిక్ మెలోడీ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ మనసును హత్తుకొనెలా ఉన్నాయి. పాటలకు వస్తున్న మంచి స్పందనతో నిర్మాతలు ఈ చిత్ర ఆడియోను త్వరలో విడుదలచేయు సన్నాహాలు చేస్తున్నారు.
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం జనవరి 26 న విడుదల కానుంది. జి.నాగేశ్వర్ రెడ్డి, విష్ణుల కలయికలో 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోదాన్ని అందించనుంది ఆశించవచ్చు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ నటించిన ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో