జనవరి 26 న విడుదల కానున్న 'ఆచారి అమెరికా యాత్ర'
- January 19, 2018విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానున్నది. కామెడీ ప్రధానంగా సాగే టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన 'స్వామి రా రా' అనే బీట్ ప్రధానంగా సాగే పాట ప్రేక్షకుల చేత స్టెప్పులేయించెలా ఉండగా, సంక్రాంతి నాడు విష్ణు విడుదల చేసిన మరో పాట 'చెలియా' సంగీత ప్రియులను అలరిస్తోంది.
అచ్చు రాజమణి సంగీతం సమకూర్చిన ఈ రొమాంటిక్ మెలోడీ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ మనసును హత్తుకొనెలా ఉన్నాయి. పాటలకు వస్తున్న మంచి స్పందనతో నిర్మాతలు ఈ చిత్ర ఆడియోను త్వరలో విడుదలచేయు సన్నాహాలు చేస్తున్నారు.
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం జనవరి 26 న విడుదల కానుంది. జి.నాగేశ్వర్ రెడ్డి, విష్ణుల కలయికలో 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోదాన్ని అందించనుంది ఆశించవచ్చు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ నటించిన ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు
తాజా వార్తలు
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..