భారతీయ మహిళకు అత్యవసర వీసా
- January 19, 2018
దుబాయ్‌లో చికిత్స పొందుతున్న భర్తను చూసేందుకోసం భారతీయ మహిళ ఒకరికి అత్యవసర వీసా మంజూరయ్యింది. తన భర్త బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, మెడికల్ ఎమర్జన్సీ కోటాలో తనకు అత్యవసర వీసా మంజూరు చేయాలని, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కి గరిమా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన భర్త పరిస్థితిపై వరుస ట్వీట్లతో సుష్మా స్వరాజ్‌కి ఆమె మొరపెట్టుకున్నారు. బాధితురాలి పరిస్థితిని అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి, అత్యవసర వీసా మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారిక వర్గాలు కేంద్ర మంత్రి ఆదేశాలతో గరిమాకి అత్యవసర వీసా మంజూరు చేశారు. అలాగే కాన్సులేట్ జనరల్‌ని అప్రమత్తం చేసి, దుబాయ్‌లో చికిత్స పొందుతోన్న గరిమా భర్తకి తగిన సహాయం అందించాల్సిందిగా సుష్మా స్వరాజ్ సూచించారు. కేంద్ర మంత్రి సూచనతో, కాన్సులేట్ ప్రతినిథులు, ఆసుపత్రికి వెళ్ళి, అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







