దుబాయ్ అవెంచురా పార్క్ మొదటి అనివెర్సరీ... అందరికి ఉచిత ప్రవేశం
- January 19, 2018
దుబాయ్: అవెంచురా పార్క్ మొట్టమొదటి పుట్టినరోజుని జనవరి 27 వ తేదీన జరుపుకొంటుంది.దుబాయ్ లో మొదటి ప్రకృతి సాహస మరియు జిప్-లైనింగ్ తో కూడిన పార్కు పలు ప్రత్యేక ఆకర్షణలు ఇక్కడ సందర్శకుల కోసం ఏర్పాటుచేయబడ్డాయి. ఈ పార్కు ఏర్పాటై ఒక ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా సందర్శకులందరికి అందరికి ఉచిత ప్రవేశాన్ని అందిస్తోంది.ఈ వేడుకల్లో ఎరియల్ ఆక్రోబట్స్, ఖర్ష డ్రమ్స్ మరియు గ్రౌండ్ అక్రోబటిక్స్ ప్రధాన ఆకర్షణగా కనబడనున్నాయి. జనవరి 27 వ తేదీ పుట్టినరోజు వేడుకలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు ఎంతో ఉత్సాహంగా ఈ పార్కులో కొనసాగుతాయి, ఆరోజు ముఖానికి రంగులు పులుముకోవడం వంటి సరదా కార్యక్రమాలతో, రోజంతా కాలక్షేపం ఉత్తేజకరమైన పోటీలు ఇక్కడ ఏర్పాటుచేయబడ్డాయి. అవెంచురా పార్కులో ఒక కేఫ్ కూడా ఆరోజు మొదలవుతుంది. సందర్శకుల కొరకు ప్రత్యేక వంటల ఎంపిక సైతం తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







