నేను రాజమౌళికి కొత్త అభిమానిని : నైజీరియా దర్శకురాలు ఓషిన్
- January 19, 2018
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో భారీ వసూళ్లు సాధించటంతో పాటు భారతీయ సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈసినిమాపై అంతర్జాతీయ స్థాయి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో టాప్ డైరెక్టర్ చేశారు. నైజీరియాకు చెందిన మహిళా దర్శకురాలు టోపె ఓషిన్ ఇటీవల బాహుబలి సినిమాను చూసి సినిమాపై తన సోషల్ మీడియా ద్వారా స‍్పందించారు.
బాహుబలి సినిమా రెండు భాగాలను మార్చి మార్చి చూసినట్టుగా వెల్లడించినా ఓషిన్, ఎలా స్పందించాలో అర్థం కావటం లేదని ట్వీట్ చేశారు. ఈ సినిమా ఓ మాస్టర్ పీస్. సినిమా చూస్తున్నప్పుడు నాకు బాధ, ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగం కలిగాయి.నా మీద బాహుబలి ఎఫెక్ట్ కనిపిస్తోంది. బాహుబలి సినిమా కోసం ఎంత సమయమైనా కేటాయించ వచ్చు అందుకే స్క్రిప్ట్, ఎడిటింగ్ లాంటి చాలా పనులున్నా పక్కన పెట్టి సినిమా చూశాను. నేను మళ్లీ బాహుబలి గురించి ట్వీట్ చేయకుండా ఉండగలనేమో చూస్తాను. అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను కూడా చూస్తానని వెల్లడించారు ఓషిన్.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







