చెర్రీకి అన్నగా ప్రశాంత్

- January 20, 2018 , by Maagulf
చెర్రీకి అన్నగా ప్రశాంత్

జీన్స్ సినిమాలో 'ప్రియా ప్రియా చంపొద్దే' అంటూ అందాల భామ ఐశ్వర్యారాయ్‌తో రొమాన్స్ చేసిన ప్రశాంత్ గుర్తున్నాడు కదా.. ఇప్పడు ఈ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అన్నగా నటించబోతున్నాడు. బోయపాటి శ్రీను - చెర్రీ కాంబోలో శుక్రవారం సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ప్రశాంత్ చెర్రీకి అన్నగా కనిపించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు. చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com