ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌కు పేస్ జోడి

- January 20, 2018 , by Maagulf
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌కు పేస్ జోడి

ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ ఈవెంట్‌లో లియాండర్ పేస్, పురవ్ రాజా జోడి దూసుకెళ్లుతున్నది. ఈ జంట ఆ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పేస్-రాజా జోడి 7-6, 5-7, 7-6 స్కోర్ తేడాతో జేమీ ముర్రో-బ్రూనో సోరీస్ జంటపై గెలుపొందింది. సుమారు రెండు గంటల 54 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. తొలి సెట్‌లో నెగ్గిన పేజ్ జంట, ఆ తర్వాత రెండవ సెట్‌ను కోల్పోయారు. ఇక నిర్ణయాత్మక మూడవ సెట్‌ను అతికష్టంగా గెలుచుకున్నారు. తర్వాత మ్యాచ్‌లో పేస్ జోడి.. కొలంబియాకు చెందిన జువాన్ సెబాస్టియన్ కాబల్, రాబర్ట్ ఫరహాతో పోటీపడనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com