స్వల్పంగా పెరిగిన పసిడి ధర
- January 20, 2018
బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం.. నేడు కాస్త కోలుకుంది. రూ.20 పెరిగి తులం బంగారం ధర రూ.30,850కి చేరింది. శుక్రవారం నాటి బులియన్ మార్కెట్ లో పసిడి ధర రూ.120 తగ్గిన సంగతి తెలిసిందే. నేటి మార్కెట్ లో వెండి ధర కూడా బంగారం బాట పట్టింది. రూ.50 పెరిగి కేజీ వెండి ధర రూ.39,900కి చేరింది. దేశీయ మార్కెట్ లో బంగారం కొనుగోళ్లు కాస్త ఊపందుకోవడంతో పసిడి ధర స్వల్పంగా పెరిగనట్టు బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. గడిచిన రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ.270 తగ్గగా.. శనివారం రూ.20 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్ లో 0.32శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1330 డాలర్లకు చేరింది. 0.38శాతం పెరిగి ఔన్సు వెండి ధర 17డాలర్లకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.30,850 ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల పసిడి ధర రూ.30,700కి చేరింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్