అవినీతిపై భారీ నిరసన చేసిన రుమేనియా
- January 21, 2018
బుఖారెస్ట్: దేశంలో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న అవినీతిపై ప్రజలు భారీయెత్తున నిరసన తెలియచేసారు. ముఖ్యంగా ప్రభుత్వం కొత్తగా రూపొందించిన అవినీతి నిరోధక చట్టం ఉన్నత స్థాయి అవినీతిపరులను రక్షించటానికి ఉపయోగిస్తోందంటూ దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో భారీయెత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అధికార సోషల్ డెమొక్రాట్స్ నేతృత్వంలోని ప్రభుత్వం గత నెలలో ఆమోదించిన కొత్త అవినీతి నిరోధకచట్టంతో ఉన్నత స్థాయిలో అవినీతిపరులను ప్రాసిక్యూట్ చేసి శిక్షించటం కష్టసాధ్యమవుతుందని విమర్శకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లును విమర్శిస్తున్న వారిలో ఒకరైన అధ్యక్షుడు దీనిపై ఇంకా సంతకం చేయాల్సి వుంది. రాజధాని బుఖారెస్ట్‌లో యూనివర్శిటీ స్క్వేర్‌నుండి పార్లమెంట్ భవనం వరకూ సాగిన నిరసన ప్రదర్శనలో దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు పాల్గన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. బుఖారెస్ట్‌తో పాటు క్లజ్, తిమిసోరా, కాన్‌స్టాంటా, బకావ్, సిబియు, లాసి తదితర నగరాలలో సైతం నిరసన ప్రదర్శనలు జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







