తొలిప్రేమ దర్శకుడి మనోభావం

- January 21, 2018 , by Maagulf
తొలిప్రేమ దర్శకుడి మనోభావం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం `తొలిప్రేమ`. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ నిర్మాత. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నారు.. ఎస్‌.ఎస్‌.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బిగ్ సీడీని, ఆడియో సీడీలను అల్లు అరవింద్ విడుదల చేయగా.. తొలి సీడీని దిల్‌రాజు అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ - "నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నన్ను నమ్మిన వ్యక్తి. ఇండస్ట్రీని నన్ను నమ్మేలా చేసిన వ్యక్తి దిల్ రాజుగారు. ఇక వరుణ్ విషయానికి వస్తే.. నేను ఎక్కడో కాన్ఫిడెన్స్ కోల్పోతున్న తరుణంలో ఆరు అడుగల నాలుగు అంగుళాల ధైర్యాన్నిచ్చాడు. తర్వాత నా నమ్మకానికి ఊపిరి పోసిన వ్యక్తి బాపినీడు.

తమన్‌ని, శ్రీమణిని మంచి సాంగ్స్ కోసం ఇబ్బంది పెట్టాను. ఇక కెమెరా మెన్ జార్జ్ నేను కన్న కలను తెరపై అందంగా చూపించిన వ్యక్తి. అలాగే ఎడిటర్ నవీన్ నేను తీసిన సినిమాను అందంగా ఎడిట్ చేశారు. ఇక సీనియర్ నరేష్‌, ఆది, ప్రియదర్శి, అపూర్వ సహా అందరికీ థాంక్స్‌.

ఇప్పటి వరకు రాశిని గ్లామర్ క్వీన్‌గా చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాలో పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునే రాశి ఖన్నా కనపడుతుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌" అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com