దోహా-కతర్ బిషప్ గా ఆంధ్రా వాసి
- January 21, 2018

కతర్:దోహా-కతర్ లో ఉంటున్న రాజోలు దీవి వాసి ఓగూరి బుల్లబ్బాయి బిషప్ గా బాధ్యతలు స్వీకరించారు.సఖినేటిపల్లి మండలం మొరికి చెందిన బుల్లబ్బాయి శనివారం కతర్లో ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు.కతర్ లోని తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుల్లబ్బాయిని ఘనం సన్మానించారు.కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ కతర్ లో తెలుగు వారైనా బుల్లబ్బాయికి అరుదైన గౌరవం దక్కడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో హైకోర్ట్ న్యాయవాది నల్లి పెద్దిరాజు,ఎన్నారై తెలుగు కమ్యూనిటీ సభ్యులు డాక్టర్ గెద్దాడ నాగేశ్వర రావు ,ఈద సంజీవ రావు,బందెల ఏసన్ బాబు,బత్తిన రత్నరాజ్,ఈద కిశోరె ,అడిదల కుమార్ రత్నం,వైస్సార్సీపీ నాయకుడు సార్ల విజయప్రసాద్ అధిక సంఖ్యలో తెలుగు ఎన్నారై పాల్గొన్నారు.
--వనంబత్తిన రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)




తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







