మత సామరస్యానికి ప్రతీక.. దర్గాలో వసంత పంచమి వేడుక
- January 21, 2018
వసంత పంచమి వేడుకలను హిందువులు జరుపుకోవడం మామూలే. మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదర, సోదరీమణులు కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకోవడం దేశ రాజధాని ఢిల్లీలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇది ఏదో ఒకటీ రెండు ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం కాదు. దాదాపు ఏడువందల సంవత్సరాలుగా ఈ వేడుకల్ని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో సూఫీ వసంత పంచమి వేడుకలు జరుగుతాయి. అయితే అదే స్ఫూర్తితో మన హైదరాబాదులోని ఓ దర్గాలో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. చార్మినార్ సమీప పత్తర్ గట్టీ ఉర్దూ గల్లీలోని హజ్రత్ షేక్‌జీ హలీ అబుల్ ఉలాయి దర్గాలో ఈ వేడుకలు జరుగుతాయి. తొలిసారి ఈ వేడుకలు 2015లో జరిగాయి. దర్గా హాలులో కనువిందు చేసే విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారం అందిస్తోంది.
అసలు 12వ శతాబ్దంలోనే ముస్లింలు ఈ వసంత పంచమి వేడుకల్ని జరుపుకోవడం ఆరంభమైంది. ఈ వేడుకలు నిర్వహించడానికి ప్రధాన కారణం ముస్లిం మత గురువైన నిజాముద్దీన్, మేనల్లుడి హఠాన్మరణంతో దిగులు చెందుతున్నాడు. అతడిని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి అమీర్ ఖుస్రో ఈ వేడుకల్ని నిర్వహించారట. మన దేశంలోనే కాదు పాకిస్తాన్‌లో కూడా సూఫీ వసంత పంచమి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా అమీర్ ఖుస్రో వసంత పంచమి, సంగీత వాయిద్యాలపై రాసిన కవితలు, పాటలు భాగ్యనగరంలోని పత్తర్‌గట్టీ దర్గాలో ఆలపిస్తారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







