'ఫస్ట్‌లేడీ' అవార్డు అందుకున్న ఐష్!
- January 22, 2018
'ఫస్ట్‌లేడీ' అవార్డు అందుకున్న ఐష్!
ముంబయి: అందాలరాశి ఐశ్వర్య రాయ్ 'ఫస్ట్‌లేడీ' అవార్డును అందుకున్నారు. శనివారం రాత్రి దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 'ఫస్ట్‌లేడీస్' అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్రపరిశ్రమలో విజయవంతంగా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న మాజీ మిస్ వరల్డ్ ఐష్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును అందజేశారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మొట్టమొదటి మహిళలకు ఈ ఫస్ట్‌లేడీ అవార్డులు అందజేస్తారు.
ప్రముఖ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన ఏకైక భారతీయ నటి ఐశ్వర్య రాయ్. ఇందుకు గానూ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ.. ఐష్‌ను సత్కరించారు. 2002 నుంచి ఐష్ ఏటా ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్ వేడుకకు హాజరవుతున్నారు.
ఈ కార్యక్రమంలో తొలి మహిళా రిక్షా డ్రైవర్ షీలా దవారే, అతి చిన్న వయసులో పైలట్ అయిన ఆయేషా అజీజ్, కశ్మీర్‌కి చెందిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి రువేదా సలామ్‌లతో కలిపి 112 మంది మహిళలు ఈ అవార్డును దక్కించుకున్నారు.
ప్రస్తుతం ఐష్ 'ఫ్యాన్ ఖాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావ్ కథానాయకులు. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!