ప్రభుత్వ నిర్ధారిత ఛార్జీల్ని ట్యాక్సీలు ప్రదర్శించాలి: మినిస్ట్రీ
- January 22, 2018
ఒమాన్:ట్యాక్సీ క్యాబ్ ఫేర్స్‌ని ఒమన్ ప్రభుత్వం త్వరలో నిర్ధారించనుంది. వాటిని ట్యాక్సీలు ఖచ్చితంగా ప్రదర్శించాలని మినిస్ట్రీ పేర్కొంది. మీటర్లపై ఆ ధరల్ని ప్రదర్వించేలా ఏర్పాట్లు చేయాలని ఒమన్ మినిస్ట్రీ స్పస్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, ఈ మేరకు ట్యాక్సీ ఆపరేటర్స్, కార్ రెంటల్ సర్వీసులకు సంబంధించిన యాక్టివిటీస్‌ని రెగ్యులేట్ చేసేలా మినిస్ట్రీరియల్ ఆర్డరణ్ని జారీ చేసింది. ప్రయాణీకుడు, తాను ప్రయాణించిన దూరానికి నిర్దేశించిన ఛార్జీలను మాత్రమే చెల్లించాలనీ, వారి నుంచి అదనంగా ఆపరేటర్లు వసూలు చేయరాదని మినిస్ట్రీ పేర్కొంది. అన్ని వాహనాల్లోనూ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ట్రాకింగ్ అలాగే నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ని ఏర్పాటు చేయాలని కూడా మినిస్ట్రీ ప్రకటించింది. మీటర్ వినియోగించకపోతే 50 ఒమన్ రియాల్స్, మీటర్‌ని తొలగిస్తే 200 ఒమన్ రియాల్స్, షాబీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఉంటే 50 ఒమన్ రియాల్స్ జరీమానా తప్పదు. వినియోగదారులు మర్చిపోయిన బ్యాగేజ్‌ని తిరిగి ఇవ్వకపోతే 50 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు. మినిస్ట్రీ స్పెసిఫికేషన్కి విరుద్ధంగా మీటర్ఉంటే 200 ఒమన్ రియాల్స్ జరీమానా పడుతుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







