దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీస్ అధికారిపై దాడి
- January 22, 2018
రష్యాకి చెందిన ఓ వ్యక్తి, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీస్ అధికారిపై దాడికి పాల్పడిన కేసుకి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోంది. 2017 నవంబర్ 26న ఈ ఘటన జరిగింది. అయితే నిందితుడు మాత్రం, తాను దాడి చేయలేదని అంటున్నాడు. ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం, పోలీస్ అధికారిని దాటి, నిషేధిత ప్రాంతంలోకి వెళ్ళేందుకు నిందితుడు ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీస్ అధికారిపై నిందితుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ విషయాన్ని బాధితుడైన పోలీస్ అధికారి పేర్కొన్నారు. తెల్లవారు ఝామున 2.45 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులకు ప్రమాదకరమైన ప్రాంతం కావడంతో అటువైపు వెళ్ళకుండా నిషేధాజ్ఞలు ఉన్నాయని, అయితే నిందితుడు చాలా దారుణంగా ప్రవర్తించాడని పోలీస్ అధికారి తెలిపారు. తనపై తీవ్రంగా నిందితుడు దాడి చేయడంతో, సహాయం కోసం ఎయిర్పోర్ట్ ఆపరేషన్ రూమ్‌ని అలర్ట్ చేశానని, ఇతర సిబ్బంది వచ్చి నిందితుడ్ని పట్టుకున్నారని ఆ అధికారి వివరించారు. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!







