పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్‌లో భూప్రకంపనలు
- November 22, 2015
పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్‌లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భూప్రకంపనలు సంభవించాయి. భూంకప లేఖినిపై తీవ్రత 6.2గా నమోదైంది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, ఫైసలాబాద్, ఆఫ్గనిస్థాన్లోని కాబూల్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్థాన్‌లోని ఖైబర్-పఖ్తున్క్వా ప్రాంతంలో, స్వాత్ లోయలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆఫ్గనిస్థాన్, తజకిస్థాన్ సరిహద్దులోని భూగర్భంలో 86 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పాక్ భూ విజ్ఞాన కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో జమ్ముకశ్మీర్, దిల్లీలోనూ భూమి కంపించింది. ఉత్తర భారతంలోని పలుచోట్ల భూ ప్రకంపనలు ఏర్పడినట్లు సమాచారం.
తాజా వార్తలు
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్







