మలేషియాలో మోదీకి ఘన స్వాగతం

- November 22, 2015 , by Maagulf
మలేషియాలో మోదీకి ఘన స్వాగతం

 ప్రధాని నరేంద్రమోదీకి మలేషియాలో ఘన స్వాగతం లభించింది. ఆగ్నేయాసియాలో మూడో రోజు పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఉదయం మలేషియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ పుత్రజయ వద్ద మోదీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆ దేశ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. నిన్న (ఆదివారం) మోదీ 13వ ఏషియాన్ -ఇండియా, పదోవ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. సోమవారం మోదీ, నజీబ్ మధ్య ద్వైపాక్షి చర్చలు, ఇరు దేశాల మధ్య వర్తక సంబంధమైన అంశాలు చర్చకు రానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com