గుమ్మడిజ్యూస్ లో ఆరోగ్యం..
- November 22, 2015
గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిల్లు ఉంటుందా?ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి. ఇటువంటలకు అద్భుతమైన రుచి, అటు ఆనారోగ్యాలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుమ్మడిలో అన్ని రకాల పోషకాంషాలుంటాయి . కార్బోహైడ్రేట్ డ్రింక్స్ కన్నా పంప్కిన్ (గుమ్మడి)జ్యూస్ ఎంతో ఉత్తమమైనది . మార్కెట్లో దొరికే ఇతర జ్యూసుల కన్నా గుమ్మడి జ్యూస్ ఉత్తమమైనది . గుమ్మడిలో ఉండే ఔషదగుణాలు మరియు థెరఫియోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ప్రతి రోజూ ఒక గ్లాసు గుమ్మడి జ్యూస్ ను త్రాగడం మంచిది. గుమ్మడిలో విటమిన్ బి1, బి2, బి6, డి, సి మరియు బీటాకెరోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. మరియు పొటాషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్ మరియు జింక్ వంటి మినిరల్స్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. ఇంకా బరువు తగ్గించడం, మలబద్దకం నివారించడం, కిడ్నీఫంక్షన్స్ ను క్రమబద్దం చేయడం, వాటర్ రిటన్షన్ తగ్గించడం, మెమెరీ పెరుగుదలకు, జీర్ణవాహికలో వార్మ్స్ ను తొలగించడం , మార్నింగ్ సిక్నెస్ ను నివారించడం, ట్యూబరిక్యూలస్ వంటి ఆరోగ్య సమస్యలన్నింటిని నివారిస్తుంది . గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందట! ముఖ్యంగా హార్ట్ డిసీజ్ మరిు మాస్క్యులర్ డీజనరేషన్ వంటి సమస్యలను నివారిస్తుంది . మరి రెగ్యులర్ డైట్ లో గుమ్మడిని చేర్చుకోవడం వల్ల మరిన్ని ఇతర ప్రయోజనాల ఏవిధంగా పొందవచ్చు ఈ క్రింది స్లైడ్ లో తెలుసుకుందాం.గుమ్మడిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్దం చేస్తుంది . ఇందులో ఉండే లాక్సేటివ్ గుణాల వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. గుమ్మడి జ్యూస్ హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే పెక్టిన్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ సి మరియు మినిరల్స్ వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గుమ్మడి జ్యూస్ శరీరానికి అవసరం అయ్యేంత చల్లదనాన్ని అందిస్తుంది. బాడీ హీట్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. గుమ్మడి జ్యూస్ క్లెన్సర్ గా పనిచేస్తుంది మరియు ఆర్టిరియల్ డిపాజిస్ట్ ను తగ్గిస్తుంది, దాంతో హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటివాటిని నివారించుకోవచ్చు. గుమ్మడి జ్యూస్ కిడ్నీ మరియు గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . రోజులో మూడు గ్లాసుల గుమ్మడి జూస్ త్రాగడం వల్ల బ్లాడర్ స్టోన్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. నిద్రలేమిని నివారించడంలో గుమ్మడి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. గుమ్మడి జ్యూస్ తో పాటు తేనె మిక్స్ చేసి త్రాగడం వల్ల నిద్రలేమి సమస్యను నివారించుకోవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







