మోడీని, అంబానీని మించిపోతున్న వర్మ కోవా
- January 23, 2018
గాడ్, సెక్స్ వెనుక ఒరిజినల్ ట్రూత్ ఇదే.. అంటున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వెండితెర మీద నుంచి యూట్యూబ్ మీదకి ఉరికి.. నానా మురికినంతా వెదజల్లుతున్న వర్మ పైత్యానికి.. రోజురోజుకూ సపోర్ట్ పెరుగుతూనే వుంది. మియా మల్కోవా అనే అమెరికన్ పోర్న్ యాక్ట్రెస్ ని దిగుమతి చేసుకుని.. ఆమెతో ఒక షార్ట్ ఫిలిం ప్లాన్ చేశాడు వర్మ. పేరు.. 'గాడ్-సెక్స్-అండ్-ట్రూత్'. దీనికి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్ తోనే సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోతోంది. అన్ని వర్గాల నుంచీ వర్మ మీదకి తాకిడి మొదలైంది. పోర్న్ వీడియోల్ని సొసైటీలోకి బలవంతంగా జొప్పిస్తున్నావంటూ విమర్శలు పడిపోతున్నాయి.
మరోవైపు.. వర్మ చేస్తున్న ఈ ప్రయోగం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. వర్మ పరిచయం చేసిన శృంగార దేవత మియా మల్కోవా.. గూగుల్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ అమ్మడు ఎంత ర్యాపిడ్ గా పాపులర్ అవుతోందంటే.. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీనే వెనక్కు నెట్టేంత ఇదిగా! స్వయానా గూగుల్ వాళ్ళే దీనికి సంబంధించిన స్టాటిక్ ఇమేజ్ పోస్ట్ చేశారు. దాన్ని అందిపుచ్చుకున్న డైరెక్టర్ వర్మ..
"ఇదిగో చూశారా? నా మియా మిల్కోవా ఎంత ఎదిగిపోయిందో?" అంటూ తన ట్విట్టర్లో పెట్టేశాడు. "నా మాల్కోవా.. మోదీనే కాదు ముఖేష్ అంబానీని కూడా దాటేసింది.." అంటూ పొంగిపోయాడు.
సోషల్ మీడియాలో మంచి కంటే చెడుకే స్పీడెక్కువ కనుక.. ఈ స్వప్న సుందరి ఇలా దూసుకెళ్తుండొచ్చు.. ఇందులో గొప్ప విశేషమేమీ లేదు. అంత మాత్రం చేత వర్మ తీస్తున్న 'నీలిచిత్రానికి' క్లీన్ సర్టిఫికెట్ వచ్చినట్లు కాదుగా?
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







