సౌదీలో రాజవంశీకుల అరెస్టుల దెబ్బకు ...అవినీతి సొమ్ము ఖజానాకు చేరుతోంది
- January 23, 2018
రియాధ్ : ధనికులను కాపాడి.. పేదోళ్ల పై పన్నుల భారాన్ని మొపరక్కడ ..చట్టం ముందు సామాన్యుడైన సుల్తాన్ అయినా ఒకటే అని పలు సంఘటనలు ఇటీవల సౌదీ అరేబియా జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం నవంబర్ నెలలో సౌదీ అరేబియాలో జరిగిన రాజకుటుంబీకుల అరెస్టులను ఆ దేశ పౌరులనే కాక యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. దేశంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారనే కారణాలతో సుమారు 95 మంది మంత్రులు, వ్యాపారవేత్తలు, రాజకుటుంబీకులను సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అరెస్ట్ చేయించి సంచలనం కల్గించారు.వారందరినీ రాత్రికి రాత్రే అరెస్ట్ చేయించి ఓ అత్యాధునిక ప్యాలెస్‌లో రహస్యంగా బంధించి వారి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రత్యేక విచారణ జరిపేరు అయితే ఆ అరెస్టుల ఫలితంగా సౌదీ ప్రభుత్వానికి ఏకంగా 124 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిపడిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న అత్యధికులు .. ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి ఆదాయంలో కొంత మొత్తాన్ని జరిమానాగా చెల్లించి ఆ చెర నుంచి విడుదల అవుతున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది రాజవంశీకులు, వ్యాపారవేత్తలు విడుదలయ్యారు. ఇలా ఇప్పటివరకు విడుదలయిన వారు చెల్లించిన మొత్తం అక్షరాలా 124 బిలియన్ డాలర్లని ( మనదేశ కరెన్సీ లో ఏడు లక్షల 91వేల 430 కోట్ల రూపాయలు) అధికారులు ఆఫ్ ధీ రికార్డుగా గుస గుసలాడుకొంటున్నారు. . ఈ నెలాఖరు వరకు నిందితులతో చర్చలు జరిపుతుందనీ, ఆ సమయానికి ఆర్థిక నేరాలను అంగీకరించకపోతే కఠిన శిక్షలు విధిస్తామని చెబుతున్నారు. అవినీతి విషయంలో సౌదీ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది యువరాజు సల్మాన్ అంతిమ లక్ష్యమట. దాంతో అక్రమాలు చేసి సంపాదించిన పలువురు ధనికులు గజ గజ వణికిపోతున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







