భారత గ్రాడ్యుయేట్లపై చైనా అస్త్రాలు

- January 23, 2018 , by Maagulf
భారత గ్రాడ్యుయేట్లపై చైనా అస్త్రాలు

బిజినెస్‌ గ్రాడ్యుయేట్లు... భారత్‌కు బలమైన వారు కాదట. వీరు భారత్‌కు బలహీనంగా మారుతున్నట్టు చైనా వ్యాఖ్యానించింది. చాలా మంది బిజినెస్‌ గ్రాడ్యుయేట్లు అమెరికాలోని టాప్‌ బహుళ జాతీయ కంపెనీలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ల్లో టాప్‌ పోస్టుల్లో ఉన్నారని, వారు సొంతంగా మల్టినేషనల్‌ కంపెనీలు నిర్మించనంత వరకు భారత్‌కు ఎలాంటి ఉపయోగకరం లేదంటూ పేర్కొంది. భారత్‌లో ఎంబీఏ గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఉన్నారని, అది భారత్‌కు ఒకానొక బలమైనప్పటికీ, ఉద్యోగాల పరంగా చూస్తే వారు భారత ఆర్థిక వ్యవస్థకు బలహీనంగా మారుతున్నట్టు చైనీస్‌ ప్రభుత్వ రంగ న్యూస్‌ అవుట్‌లెట్‌ గ్లోబల్‌ టైమ్స్‌ తన ఆర్టికల్‌లో తెలిపింది. ఉన్నత స్థాయి టెక్నికల్‌, మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌ ఎక్కువగా విదేశీ కంపెనీలకే సేవలందిస్తున్నారని పేర్కొంది. దీంతో ఆర్థిక వృద్ధిలో భారత్, చైనాను అధిగమించలేకపోతుందని తెలిపింది. ప్రతిభావంతులైన భారత మేనేజర్లతో భారత్‌ సొంతంగా బహుళ జాతీయ కంపెనీలను ఏర్పాటుచేయాల్సి ఉందని వివరించింది. 

''ఆర్థిక వృద్ధిని పెంచుకోవాలంటే, భారత్‌కు ఉన్నత స్థాయి కంపెనీలు కావాలి. సొంతంగా టాప్‌ మల్టినేషనల్‌ కంపెనీలను నిర్మించుకోవాలి. భారతదేశం వ్యవస్థాపకతకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించాలి'' అని గ్లోబల్‌ టైమ్స్‌ ఆర్టికల్‌ ప్రచురించింది. సొంత వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికే భారత్‌, మంచి వాతావరణం కల్పించనప్పుడు, విదేశీ పెట్టుబడిదారులకు మంచి వాతావరణం ఎలా సృష్టిస్తారని ప్రశ్నించింది. ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతున్నప్పటికీ, విదేశీ పెట్టుబడులు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సిందేనని వ్యాఖ్యానించింది. చైనాతో భారత్‌ను పోల్చినప్పుడు, చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపింది. ఎందుకంటే తమ దేశంలో చాలా మంది ప్రజలు వ్యాపారాలను స్థాపించడం, మార్కెట్ ఆర్ధిక సంపదకు తోడ్పడటం, ఆర్ధికవృద్ధికి పునాది వేయడం చేస్తున్నారని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com