లిబియాలో కారు బాంబు పేలుళ్లు..33 మంది దుర్మరణం
- January 23, 2018
లిబియా: లిబియాలో గుర్తు తెలియని దుండగులు కారు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. సెంట్రల్ అల్ సల్మనీ జిల్లా పశ్చిమ బెన్‌ఘాజీ పట్టణంలోని మసీదు ప్రాంగణంలో ఈ పేలుళ్లు సంభవించాయి. బాంబు పేలుళ్లలో 33మంది ప్రాణాలు కోల్పోగా..మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. సమాచారమందుకున్న భద్రతాబలగాలు, వైద్య శాఖ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి వచ్చిన 15 నిమిషాల సమయంలోనే మరో భారీ బాంబు పేలుడు సంభవించింది. రెండోసారి జరిగిన పేలుడులో అంబులెన్స్‌లో ఉన్న చాలా మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో మిలటరీ దళాలు, వైద్య సిబ్బంది, ప్రజలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉన్నదని..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవలి కాలంలో లిబియాలోని మసీదు పరిసర ప్రాంతాల్లో తరచూ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







