యెమెన్‌కు 1.5బిలియన్ డాలర్ల సౌదీ మిత్రదేశాల సాయం
- January 23, 2018
సనా : యెమెన్‌కు 1.5బిలియన్ డాలర్ల ( రూ.9,566 కోట్లు ) సాయం అందజేయనున్నట్టు సౌదీ మిత్రదేశాలు ప్రకటించాయి. ఐరాస అభ్యర్థన మేరకు తామీ సాయం చేయనున్నట్టు పేర్కొన్నాయి. యెమెన్‌లో 2015లో అంతర్యుద్ధం చెలరేగింది. యుద్ధవాతావరణం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంతర్యుద్ధం కారణంగా దాదాపు 10వేల మంది చనిపోయారు. లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. ప్రాథమిక అవసరాలు అందక ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. అంతేగాకుండా, అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఆకలికేకలతో యెమెన్ తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో యెమెన్ పౌరులకు సాయం అందించాలని ప్రపంచ దేశాలకు ఇటీవల ఐరాస పిలుపునిచ్చింది. ఐరాస నివేదిక ప్రకారం...యెమెన్‌లో 2కోట్ల 20లక్షల మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు.80లక్షల మంది అర్ధాకలితో అలమటిస్తున్నారు. వారిలో 18లక్షల మంది చిన్నారులు ఐదేండ్ల లోపువారున్నారు. యెమెన్‌లో కలరా వ్యాధి వ్యాపించడంతో ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. సౌదీ మిత్రదేశాలు తమకు సహకరిస్తున్నందుకు యెమెన్ అధ్యక్షుడు అబ్దు రబు మన్సూర్ హాదీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







