ముఖ్యమంత్రిగా మహేష్.. ప్రీ లుక్ పోస్టర్ రెలీజ్
- January 23, 2018_1516775252.jpg)
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ భరత్ అను నేను. మహేష్ 24వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై డీవివి దానయ్య నిర్మిస్తుండగా, ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ ప్రమాణ స్వీకార పాఠంతో ఉన్న పోస్టర్ని విడుదల చేస్తూ, మూవీ ఫస్ట్ లుక్‌ని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పోస్టర్లో భారీగా ప్రజలు, దానిపై ‘‘శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని ఉంది. ఇక తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా ఉంది. ఆయన ముందు చాలా మంది ప్రజలు ఉన్నారు. ఈ పోస్టర్ పై కూడా కొన్ని ప్రమాణ స్వీకార పాఠం లిఖించారు. ఈ పోస్టర్ ద్వారా మూవీ ఫస్ట్ లుక్ ని జనవరి 26 ఉదయం 7గం.లకు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రీ లుక్ పోస్టర్ ని బట్టి మహేష్ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. తన ప్రతి సినిమాలో సమాజానాకి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే కొరటాల భరత్ అను నేను మూవీ తో ఏ మెసేజ్ ఇస్తాడా అని అందరు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో