90వ ఆస్కార్ నామినేషన్స్ ప్రకటన విడుదల
- January 24, 2018
ప్రపంచంలో అతి పెద్ద సినీ పండుగ ఏదంటే ఆస్కార్ అని ఠక్కున చెప్తారు. ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరో,హీరోయిన్సే కాక ప్రతీ టెక్నీషియన్ కూడా ఆస్కార్ అందుకోవాలని తహతహలాడుతుంటారు. ప్రతి ఏడాది జరిగే ఆస్కార్ పండుగా ఈ సారి లాస్ ఏంజెల్స్ లో ఉన్న డాల్బీ థియేటర్ లో మార్చి4న అంగరంగ వైభవంగా జరగనుంది. 90వ ఆస్కార్ అవార్డుల పోటిలో భాగంగా నిన్న పలు విభాగాలలో నామినేషన్స్ ప్రకటించారు నిర్వాహకులు. ‘ది షేప్ ఆఫ్ వాటర్’ 13 నామినేషన్లు దక్కించుకోగా, ‘డంకర్క్’ ఎనిమిది విభాగాల్లో, ‘త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’ ఏడు విభాగాల్లోనూ నామినేషన్ దక్కించుకున్నాయి. గతేడాది ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన జిమ్మీ కెమ్మెల్.. ఈ ఏడాది కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనుండడం విశేషం. పలు విభాగాలలో నామినేషన్స్ కి సంబంధించిన వివరాలు క్రింద చూద్దాం. ఉత్తమ చిత్రం కాల్ మీ బై యువర్ నేమ్, డార్కస్ట్ అవర్, డంకర్క్, గెట్ అవుట్, లేడీ బర్డ్, ఫాంథమ్ థ్రెడ్, ది పోస్ట్, ది షేప్ ఆఫ్ వాటర్, త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి. ఉత్తమ చిత్రం విభాగంలో ఈ తొమ్మిదీ నామినేషన్ దక్కించుకున్నాయి.
ఉత్తమ నటుడు టిమోథ్ చలామెట్ (కాల్ మీ బై యువర్ నేమ్), డానియెల్ డూ–లెవిస్ (ఫాంథమ్ థ్రెడ్), డానియెల్ కలూయా, (గెట్ అవుట్,) గ్యారీ ఓల్డ్‌మేన్ (డార్కస్ట్ అవర్), డెంజెల్ వాషింగ్టన్, (రోమన్ జో ఇజ్రాయెల్ ఎస్క్యూ). ఉత్తమ నటి సాలీ హాకిన్స్ (ది షేప్ ఆఫ్ వాటర్), ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్, (త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి), మార్కెట్ రాబీ (ఐ, టోన్యా), సాయోర్స్ రోనన్ (లేడీ బర్డ్), మెరిల్ స్ట్రీప్ (ది పోస్ట్). ఉత్తమ దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ (ఫాంథమ్ థ్రెడ్), గిలియర్మొ దెల్తొరొ (ది షేప్ ఆఫ్ వాటర్), గ్రెటా గెర్విగ్ (లేడీ బర్డ్), క్రిస్టోఫర్ నోలన్ (డంకర్క్), జోర్డాన్ పీలే (గెట్ అవుట్).
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!