తెలుగు, తమిళ భాషల్లో సమంతతో 'యు టర్న్'.

- January 24, 2018 , by Maagulf
తెలుగు, తమిళ భాషల్లో సమంతతో 'యు టర్న్'.

కన్నడంలో సూపర్ హిట్ మూవీ యు టర్న్.. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ , రోగర్ నారాయణ్ ప్రధాన పాత్రలలో నటించారు.. ఈ మూవీకి పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు.. ఒక ఫ్లై ఓవర్ పై ఉన్న యు టర్న్ వద్ద తరచు ప్రమాదాలు జరుగుతుంటాయి.. ఇక్కడే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయోనని పరిశోధన చేస్తే ఆశ్చర్యకరవిషయాలు బయటపడ్డాయి.. ఈ కాన్సెప్ట్ పవన్ చాలా చక్కగా డీల్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.. ఇప్పడు ఈ మూవీని పవన్ దర్శకత్వంలోనే తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేయనున్నారు.. రెండు భాషల్లోనూ సమంత నటించనుంది.. ఈ మూవీకి సమంత నిర్మాత అని ప్రచారం జరిగినప్పటికీ తాజాగా ఈ మూవీకి తాను నిర్మాత కాదంటూ స్వయంగా సమంత ప్రకటించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.. వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com