ఏప్రిల్ 27నే 'నా పేరు సూర్య' విడుదల తేదీని ఖరారు చేసేశారు
- January 24, 2018
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదలపై వస్తున్న రూమర్లకు నిర్మాతలు చెక్ పెట్టారు. సినిమా విడుదల తేదీని మార్చినట్లు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండటంతో నిర్మాతలు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. అనుకున్న తేదీ ప్రకారం ఏప్రిల్ 27న విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను అనే సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కూడా ఏప్రిల్ 27నే ఉండటంతో ఓపెనింగ్స్ దెబ్బతినకూడదని ‘నా పేరు సూర్య‘ను ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. వాటన్నింటికి చిత్ర నిర్మాతలు ఫుల్స్టాప్ పెట్టారు. ముందుగా అనుకున్న ప్రకారమే చిత్రం ఏప్రిల్ 27నాడే విడుదలవుతుందని వెళ్లడించారు. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. విశాల్-శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!