అభివృద్ధి బాటలో మయన్మార్‌ శాంతి క్రమం

- January 24, 2018 , by Maagulf
అభివృద్ధి  బాటలో మయన్మార్‌ శాంతి క్రమం

యాంగాన్‌ : మయన్మార్‌ శాంతి క్రమం పురోగతి బాటలో పయనిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం (ఎన్‌సిఎ)తో చేతులు కలుపుతామంటూ రెండుకు పైగా సాయుధ గ్రూపులు ప్రకటించాయి. మంగళవారం ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్‌ సూకీ, రక్షణ విభాగ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మిన్‌ ఆంగ్‌ హ్లాయింగ్‌లతో సమావేశం అనంతరం న్యూ మోన్‌ స్టేట్‌ పార్టీ (ఎన్‌ఎంఎస్‌పి), లాహు డెమోక్రటిక్‌ యూనియన్‌ (ఎల్‌డియు)లు త్వరలో ఎన్‌సిఎపై సంతకాలు చేయడానికి అంగీకరించాయి. ఈ మేరకు రెండు పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ రెండు పార్టీల నేతలు యునైటెడ్‌ నేషనాలిటీస్‌ ఫెడరల్‌ కౌన్సిల్‌ (యుఎన్‌ఎఫ్‌సి)లో సభ్యులు. కాల్పుల విరమణయేతర గ్రూపునకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. సమావేశం అనంతరం సూకీ పత్రికల వారితో మాట్లాడుతూ, శాంతి క్రమం దిశగా పురోగతి పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com