పద్మావత్ సెగ తెలుగు రాష్ట్రాలకు..

- January 25, 2018 , by Maagulf
పద్మావత్ సెగ తెలుగు రాష్ట్రాలకు..

కరీంనగర్ః దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న చిత్రం పద్మావత్‌. ఎన్నో వివాదాల నడుమ ఈ చిత్రం నేడు (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈసినిమా విడుదలను వ్యతిరేకిస్తున్న కర్ణిసేన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా విడుదల అవుతున్న థియేటర్ల వద్ద భారీ భద్రత కల్పించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 'పద్మావత్‌' మార్నింగ్‌షోలు మొదలయ్యాయి.
ఇప్పుడు ఆసెగ తెలుగు రాష్ట్రాలకు పాకింది. సినిమా విడుదలను అడ్డకుంటూ తెలంగాణలోని కరీంనగర్‌లో భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పద్మావతి చిత్ర యూనిట్‌కు శవయాత్ర నిర్వహించారు. అనంతరం సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్‌ వద్ద దిష్టి బొమ్మలను దగ్థం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పద్మావత్‌ చిత్రం భారీగానే విడుదలైంది. దాదాపు 400పైగా థియేటర్లలో రిలీజైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com