దావోస్ లో బ్రహ్మణీ హల్ చల్
- January 25, 2018
పెట్టుబడుల ఆకర్షణ కోసం స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, అధికారులు ఉన్నారు. లోకేష్ నే కాదు. ఆయన భార్య నారా బ్రాహ్మణి ఈ సదస్సులో పాల్గొన్నారు. హెరిటేజ్ పుడ్స్ సి.ఎం.డిగా ఆమె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందుకే మహిళా పారిశ్రామిక వేత్తగా దావోస్ సదస్సులో పాల్గొంటున్నారామె. అటు మామ చంద్రబాబు, బావ లోకేష్ నే కాదు.. తాను ఆ సదస్సులో పాల్గొని అవగాహన చేసుకుంటున్నారు. ప్రపంచంలోని నాలుగు వందలకు పైగా పెద్ద కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అందుకే ఆ సదస్సులో పాల్గొనడం ద్వారా తన వ్యాపారాభివృద్ధి తోపాటు.. పెట్టుబడుల సంగతిని చూడనున్నారామె.
ఏపీకి ఐటీ పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేష్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు బాబు కోడలు, లోకేష్ భార్య అయిన నారా బ్రాహ్మణికి ఏపీ అభివృద్ధి విషయంలో సంబంధం లేకపోయినా అక్కడకు వెళ్లడం ఆసక్తికరమే. వచ్చే రెండు నెలల్లో ఏపీలో ఏకంగా 2 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామికవేత్తల విభాగంలో జరిగిన సమావేశానికి బ్రాహ్మణి హాజరయ్యారు. ఏపీకి వచ్చే పెట్టుబడులతో పాటు ఐటీ ఉద్యోగాల విషయంలో బ్రాహ్మణి భర్త లోకేష్ కు సహకరిస్తున్నారు. పారిశ్రామికవేత్తల సదస్సులతో పాటు మహిళా పారిశ్రామికవేత్తల సదస్సుల్లోనూ ఏపీకి ఓ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు బ్రాహ్మాణి. లోకేష్ మంత్రిగా ఐటీ రంగం, గ్రామీణాభివృద్ధికి పడుతోన్న కష్టంలో ఆమె భాగస్వామి అవుతున్న తీరు ప్రశంసనీయమే. రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణి పోటీ చేస్తారనే ప్రచారం వచ్చింది. గుంటూరులో ఆమె పోటీ చేస్తారనే ప్రచారం వచ్చినా తాను రాజకీయాల్లోకి రావటం లేదని ఆమె చెప్పేసింది. అయినా సరే ప్రచారంలో ఆమె పాల్గొంటారని తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కుమార్తె కావడంతో బ్రాహ్మణికి జనాల్లోను క్రేజ్ ఉంటోంది. అందుకే ఎన్నికల్లో ప్రచారం చేస్తారంటున్నారు. ఆ మేరకు ఫలితం వస్తుందనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇందుకు చంద్రబాబు ఒప్పుకుంటారో లేదోననే ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలంగాణలో సి.ఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కేసీఆర్ కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావులు చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. అలానే చంద్రబాబు కుటుంబం నుంచి బ్రాహ్మణి రాజకీయాల్లో వస్తే మంచిదంటున్నారు. అలానే విపక్ష నేత జగన్ కుటుంబం నుంచి విజయమ్మ, షర్మిలలు ఇప్పటికే రాజకీయాల్లో అడుగు పెట్టారు. విజయమ్మ పోటీ చేసినా. షర్మిల ప్రచారానికే పరిమితమయ్యారు. రానున్న రోజుల్లో జగన్ సతీమణి భారతి రాజకీయాల్లోకి వస్తారంటున్నారు. అప్పుడు రాజకీయం రసవత్తరంగా సాగే వీలుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







