భాగమతిలో బాహుబలి ట్విస్ట్ !
- January 25, 2018_1516879112.jpg)
రేపు విడుదలకాబోతున్న 'భాగమతి' రిజల్ట్ కోసం అనుష్క ఫాన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసంక్రాంతికి విడుదల అయిన భారీ సినిమాలు అన్నీ ఘోర పరాజయం చెందడంతో ఈ ఏడాది మొట్టమొదటి సూపర్ హిట్ మూవీగా 'భాగమతి' మారబోతోంది అన్న అంచనాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. 'అరుంధతి' తరహాలో అవుట్ అండ్ అవుట్ హారర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అశోక్ దీన్ని తీర్చిదిద్దిన విధానం అందరికీ బాగా నచ్చుతుంది అని ఈ సినిమా ఫైనల్ కాపీ చుసిన వారు చెపుతున్నారు.
ఈసినిమాకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ కీలకం కావడంతో అనుష్క నటించిన 'భాగమతి' రాణి పాత్రపైనే అందరి దృష్టి ఉంది. ఈ సినిమా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా హాట్ టాపిక్ గామారడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికికారణం నిన్న విడుదలచేసిన 'భాగమతి' ప్రమోషనల్ వీడియోలో ఒక ఫ్రేమ్ లో ప్రభాస్ తళుక్కున మెరిసి మాయమవ్వడం అందులో ప్రభాస్ మొహానికి కర్చీఫ్ కట్టుకున్నా ప్రభాస్ అభిమానులు మాత్రం అతడిని సులువుగా గుర్తు పట్టారు. దీనితో ప్రభాస్ ఈ సినిమాలో ఏమైనా ప్రత్యేక పాత్ర చేసాడా అన్న కోణంలో ప్రభాస్ అభిమానులు చర్చలు చేస్తున్నారు.
అయితే తెలుస్తున్న సమాచారం వేరే విధంగా ఉంది. ఈ సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సన్నిహితులది కాబట్టి ఆసంస్థ నిర్మాతలతో తనకున్న సాన్ని హిత్యంతో ఈ మూవీ సెట్స్ కు వచ్చి ఉంటాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా మేకింగ్ వీడియోస్ లో సినిమా సెట్ కు ఎవరెవరు వచ్చారు అని చూపించడం సహజం. ఇది అన్ని సినిమాల ప్రమోషన్ విషయంలో జరిగే విషయమే. అయితే అలాంటి సందర్భం అయితే ప్రభాస్ మొహానికి మాస్క్ లాగా కర్చీఫ్ వేసుకోవడం ఎందుకు నేరుగా బయటికే చూపించుకోవచ్చుగా అని కొందరుఅడుగుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానంలేదు.
అయితే మరికోనారు ప్రభాస్ కు డస్ట్ ఎలర్జీ ఉండటం వల్ల ఇలా ఖర్చీఫ్ కట్టుకుని ఉంటాడు అని ప్రచారంచేస్తున్నారు. అయితే అనుష్క-ప్రభాస్ లమధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల భాగమతి లో ఏమైనా ప్రభాస్ ట్విస్ట్ ఉంటుందా అన్న అనుమానాలు మాత్రం ఇంకా ప్రభాస్ అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ వార్తలలోని నిజాలు ఎన్నో రేపటికి కాని తెలియక పోయినా ప్రభాస్ 'భాగమతి' సెట్ లో కర్చీఫ్ తో కనిపిస్తున్న ఫోటో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. 'బాహుబలి 2' తరువాత విడుదల కాబోతున్న అనుష్క సినిమా కావడంతో ఈమూవీకి అత్యంత భారీ స్థాయి లో ఓపెనింగ్స్ వచ్చే అవకాసం ఉంది..
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!