విశాఖ రైల్వేజోన్‌ సాధ్యపడదు

- January 25, 2018 , by Maagulf
విశాఖ రైల్వేజోన్‌ సాధ్యపడదు

ఏపీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. విశాఖ రైల్వే జోన్ సాధ్యపడని తేల్చి చెబుతోంది. విశాఖ రైల్వేజోన్‌ సాధ్యపడదని ఇప్పటివరకు వచ్చిన కమిటీ నివేదికలు చెప్పాయని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఐతే, ఈ విషయంపై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

త్వరలో కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరగనున్న నేపథ్యంలో.. బడ్జెట్ తో రైల్వే జోన్ కు సంబంధం లేదని మంత్రి సుజనా తెలిపారు. దీన్ని బట్టి వచ్చే కేంద్ర బడ్జెట్ లో వైజాగ్ రైల్వే జోన్ గురించి ప్రస్తావన ఉండకపోవచ్చు. ఇక, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సంస్ధల శాఖల ఏర్పాటుకు కేంద్రం రెడీగా ఉంది. ఈ విషయంలో స్ధలం, భవనాలు ఎక్కడ లభ్యత ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వమే సూచించాలని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com