కమల్ హాసన్ ‘నాలై నమదే’ పర్యటన
- January 25, 2018
విలక్షణ నటుడు కమల్ హాసన్ వచ్చే నెల 21న తాను స్థాపించబోయే రాజకీయ పార్టీ పేరు, చిహ్నంతో పాటు విధివిధానాలను ప్రకటించనున్నారు. అలాగే ‘నాలై నమదే’ అనగా.. ‘రేపు మనదే’ పేరుతో ఫిబ్రవరి 21 నుండి తన రాజకీయ పర్యటన ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. గురువారం చెన్నై విమానాశ్రయంలో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ అదే రోజు పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలు ప్రకటిస్తానని తెలిపారు. పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అదే రోజున నమోదు చేయనున్నట్లు తెలిపారు. తన పర్యటనలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్‌గా నిలుస్తామని చెప్పారు.
మనిషి జీవితంలో అన్ని రంగాలు ముఖ్యమే అని, రాజకీయాలు కూడా మంచి రంగమే అని నిరూపిస్తానని కమల్ పేర్కొన్నారు. తమిళ తల్లి గీతానికి గౌరవంగా అందరూ నిలబడాలని ఆయన సూచించారు. కొన్ని సమస్యలకు పరిష్కారంతోనే సమాధానం చెప్పాలని, జాతీయ రాజకీయాల కంటే తాను ప్రాంతీయతకే ప్రాధాన్యత ఇస్తానని కమల్ వెల్లడించారు. రజనీకాంత్, తాను తమిళ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక రాజకీయాలు సాధ్యమా అనేది తనకు తెలియదని, అందరూ బాగుండాలన్నదే తనకు ముఖ్యమని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







