సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ ఫస్ట్ పోస్ట్
- January 25, 2018
హైదరాబాద్: ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్ కేవలం రెండు రోజుల్లోనే 6.8 లక్షల మంది ఫాలోయర్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు. తాజాగా ఆయన చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ తొలి పోస్టుకు అనూహ్యమైన స్పందన వస్తోంది. తన లేటెస్ట్ ప్రాజెక్టకు సంబంధించిన ఓ ఫొటో అప్‌లోడ్ చేసిన మహేశ్.. ‘రేపు ఉదయం 7 గంటలకు’ అంటూ చేసిన తొలి పోస్టును గంట వ్యవధిలోనే 22 వేల మంది లైక్ చేశారు.
గతంలో తనకు శ్రీమంతుడు లాంటి భారీ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో కియారా అద్వాని కథానాయిక. మహేశ్ సీఎం పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్ కాగా, రిపబ్లిక్ డే.. ఉదయం ఏడు గంటల సమమానికి రెడీగా ఉండండి. ఆల్ ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో భరత్ ఫస్ట్ ఓత్ (ప్రమాణం) వినడానికి అంటూ ఇటీవల యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీ పోస్టర్ ను మహేశ్ అప్‌లోడ్ చేయగా ఆయన ఫాలోయర్లు టాలీవుడ్ ప్రిన్స్ తొలి ఇన్‌స్టాగ్రామ్ సందేశంపై స్పందించి లైక్స్, కామెంట్లతో అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







