'రాహుల్ ఏ రాష్ట్రానికి వెళ్లి పోటీ చేయమన్నా నేను రెడీ' : విజయశాంతి
- January 25, 2018
హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం పనిచేస్తానని విజయశాంతి అన్నారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటనను ఉద్దేశించి రాష్ట్రంలో పవనే కాదు ఎవరైనా పర్యటన చేసుకోవచ్చని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత క్రియాశాల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి నేటికి 20 ఏళ్లు అవుతుందన్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని, అయితే రాహుల్ గాంధీ తనను ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారని ఆమె చెప్పారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లి పోటీ చేయమన్నా నేను రెడీ అని అన్నారు. కెసిఆర్ పాలన బాగలేదనే ఫీడ్‌బ్యాక్ ఉందని అన్నారు. ఉద్యమం నాటి కెసిఆర్ వేరు ఇప్పటి కెసిఆర్ వేరు అని చెప్పారు. మీడియాకు ఫ్రీడం లేకుండా చేశారని, కోదండరామ్‌ను మాట్లాడకుండా చేస్తున్నారని అన్నారు.
తాజా వార్తలు
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!







