వినూత్న శైలిలో నిరసన తెలిపిన భారత జవాన్లు
- January 26, 2018
అట్టారిః పాకిస్థాన్ సైనికులకు తమదైన శైలిలో నిరసన తెలిపారు బీఎస్ఎఫ్ జవానులు. రిపబ్లిక్ డే సందర్భంగా స్వీట్లు పంచుకోవడానికి నిరాకరించారు. సరిహద్దుల్లో పాక్ తీరుపై ఆగ్రహంగా ఉన్న జవాన్లు.. ఈ విధంగా నిరసన తెలిపారు. ముఖ్యమైన పండుగలు, జాతీయ దినోత్సాల సందర్భంగా బోర్డర్లో స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాకిస్థాన్ సైనికులకు భారత జవానులు ఇస్తే. వాళ్లు వీళ్లకి ఇస్తారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ సంప్రదాయాన్ని శుక్రవారం బ్రేక్ చేశారు బీఎస్ఎఫ్ జవాన్లు. గురువారమే ఈ విషయాన్ని పాక్ రేంజర్లకు తెలిపారు. రిపబ్లిక్ డే రోజున ఎలాంటి కార్యక్రమాలు ఉండవని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ.. వాళ్లకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చేందుకే ఇలా చేశామన్నారు బీఎస్ఎఫ్ సైనికాధికారి.
తాజా వార్తలు
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







