పద్మావత్ సినిమాపై రాష్ట్రపతి వ్యాఖ్యలు
- January 26, 2018
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రిపబ్లిక్ డే ప్రసంగంలో విలువలతో కూడిన అభివృద్ధిని ఆకాంక్షించారు. పొరుగువారి అభిప్రాయాలకూ, హక్కులకూ, వ్యక్తిగత గోప్యతకూ విలువివ్వాలని కోరారు. పండుగలు చేసుకున్నా, నిరసనలు చేపట్టినా ఇతరులకు అసౌకర్యం కల్గించరాదంటూ పద్మావత్ సినిమా నిరసనలపై పరోక్షంగా కామెంట్ చేశారు. విభేదాలను హుందాగా వ్యక్తపరచాలన్నారు. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దళిత రాష్ట్రపతుల్లో రెండోవారైన రామ్ నాథ్ కోవింద్ తొలి రిపబ్లిక్ డే ప్రసంగమిది. సుప్రీంకోర్టు వివాదాన్ని కూడా రాష్ట్రపతి పరోక్షంగా ప్రస్తావించారు.
వ్యక్తుల కన్నా వ్యవస్థ పెద్దది.. తాము పనిచేసే వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టేట్లు అందులో పనిచేసేవారు కృషి చేయాలని కోరారు. 21 వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా డిజిటల్ ఆర్థికవ్యవస్థను, ఆటోమేషన్, రోబోటిక్స్, జినోమిక్స్.. మొదలైనవాటి సాకారం కోసం కదలాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన అతివేగంగా జరగాలని ఆకాంక్షించారు.
ఇందుకోసం లాభాలు, అధికారాలు వదులుకొని దాతృత్వ స్ఫూర్తిని అవలంభించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







