గణతంత్ర వేడుకలకు అందుకే రాలేక పోతున్నా..! : ఏపీ సీఎం
- January 26, 2018_1516955903.jpg)
ఈ రోజు దేశ వ్యాప్తంగా 69వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందామన్నారు
ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాగా, విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాలు నిర్వహిస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాలేకపోతున్నారు. నిన్న దావోస్ నుంచి బయల్దేరిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 7 గంటలకు అమరావతి రావాల్సి ఉంది.
అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది. ఈ కారణంగా ఆయన 69వ గణతంత్ర వేడుకలకు హాజరు కాలేక పోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అబుదాబిలో చంద్రబాబు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 69వ గణతంత్ర దినోత్సవం పాల్గొన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ గౌరవ వందనాలు స్వీకరించారు. బాధ్యత గల పౌరులుగా మనందరం సమిష్టిగా శ్రమించాలన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధన లక్ష్యంతో అహర్నిశం, అనుక్షణం కృషి చేద్దామని చెప్పారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక