'ఐ ఎస్ ఐ ఎస్' ముఠాలతో మన భారతీయుడు: అదుపులోకి తీసుకున్న దుబాయ్ ప్రభుత్వం.
- November 23, 2015
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో లింకులు పెట్టుకుని భారతదేశానికి చెందిన యువకులను మభ్యపెట్టి ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న ఓ భారతీయుడిని అరెస్టు చేశామని దుబాయ్ పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని భట్కల్ ప్రాంతానికి చెందిన అద్నాన్ దముడి అనే వ్యక్తిని అరెస్టు చేశామని దుబాయ్ పోలీసులు చెప్పారు. ఇతను 2012 నుంచి దుబాయ్ లో నివాసం ఉంటున్నాడు. అక్కడే అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అద్నాన్ ఇస్లామిక్ స్టేట్ తో లింకులు పెట్టుకున్నాడు. తరువాత భారతదేశానికి చెందిన యువతను ఆకర్షించి, వారికి మాయమాటలు చెప్పి ఇస్లామిక్ స్టేట్ లో చేర్పిస్తున్నాడు. ఇతని మీద దుబాయ్ పోలీసులకు అనుమానం వచ్చింది. కొన్ని నెలల నుంచి అద్నాన్ కదలికల మీద పోలీసులు నిఘా వేశారు. కచ్చితమైన వివరాలు సేకరించిన దుబాయ్ పోలీసులు అద్నాన్ ను అరెస్టు చేశారు. ఇతను అనేక మంది భారతీయ యువకులకు బ్రైన్ వాష్ చేసి వారిని ఇస్లామిక్ స్టేట్ లో చేర్పించాడని పోలీసులు అంటున్నారు. భారతీయులను ఇస్లామిక్ స్టేట్ లో చేర్పిచడంతో సక్సస్ అయిన అద్నాన్ నిత్యం ఉగ్రవాదులతో టచ్ లో ఉంటున్నాడని దుబాయ్ పోలీసులు తెలిపారు. మైక్రో బ్లాగింగ్, ట్విట్టర్ ద్వార ఇతను ఉగ్రవాదులను సంప్రదించాడని వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న భారత్ ఇంటిలిజెన్స్ అధికారులు దుబాయ్ పోలీసులతో సంప్రదించారు. అద్నాన్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. అద్నాన్ ను వీలైనంత త్వరగా భారత్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







