ఎయిర్‌పోర్టులో పిల్లలు జాగ్రత్త
- January 26, 2018
దుబాయ్: గత ఏడాది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల సంఖ్య 91.2 మిలియన్లు. ఇంత పెద్దయెత్తున ప్రయాణీకులు ఈ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, ఈ విమానాశ్రయం ద్వారా దేశంలోకి రావడం జరుగుతోందనీ, ఈ క్రమంలో ప్రయాణీకులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు సూచించారు. ఇటవలే దుబాయ్‌కి వచ్చిన ఓ కుటుంబం, తమ చిన్నారిని విమానాశ్రయంలో మర్చిపోయింది. విమానాశ్రయ సిబ్బంది, ఆ చిన్నారిని గమనించి, ఎయిర్‌పోర్ట్ నుంచి అల్ అయిన్‌లోని తమ ఇంటికి వెళ్ళిపోయిన ఆ కుటటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. టెక్నాలజీ సాయంతో చిన్నారి తల్లిదండ్రుల్ని గుర్తించగలిగారు. దుబాయ్ పోలీస్ - ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలి అతిక్ బిన్ లహెజ్ మాట్లాడుతూ, చిన్నారి తప్పిపోయిన సమాచారాన్ని తల్లిదండ్రులకు తాము చేరవేశామనీ, అప్పటికీ వారు చిన్నారి తప్పిపోయిన విషయం గుర్తించలేకపోయారని అన్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయనీ, కుటుంబ సభ్యులు చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉంటే సమస్యలు తలెత్తవని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







