సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న సీఎం కేసిఆర్
- January 26, 2018
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఇతరులను దూషించడం మరీ ఎక్కువైపోయింది. అయితే ఇకనుంచి ఏమాత్రం ఆలా చేశారా.. జైలు ఊచలు లెక్కబెడతారు. తాజాగా దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సంతకం కూడా చేశారు. సోషల్ మీడియా ద్వారా సభ్యత మరిచి ఇతరులను దూషించిన, కించపరిచినా జైలుకు వెళ్లాల్సిందే! కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవడం వంటి సంప్రదాయాలేమీ పాటించనక్కర్లేదు. పిర్యాదు అందిన వెంటనే పోలీసులు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు.
ఈ మేరకు ఐపీసీ చట్టంలోని సెక్షన్లు 506, 507 కింద పేర్కొన్న నేరాలను కోర్టు అనుమతి లేకుండానే (కాగ్నిజబుల్) విచారించదగినవిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. కాగాఈ ఫైలుపై నిన్న(గురువారం) రాత్రి సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఇకనుంచి ఎవరైనా సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు దిగితేన వారు ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతామని, ఈ మేరకు చట్టం తీసుకొస్తామని సీఎం గతంలో అనేకసార్లు హెచ్చరించారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







