శ్రీకాంత్ 'ఆపరేషన్ 2019' టీజర్ లాంచ్
- January 27, 2018
హైదరాబాద్: సీనియర్ నటుడు శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆపరేషన్ 2019'. 'బీవేర్ ఆఫ్ పబ్లిక్' అనేది ఉపశీర్షిక. కరణం బాబ్జీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ సమర్పిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ శుక్రవారం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కాగా టీజర్‌ను శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దీన్ని శ్రీకాంత్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇందులో శ్రీకాంత్ ఒంటి నిండా గాయాలు కనిపించాయి. రౌడీలు ఆయన్ను తీవ్రంగా గాయపరిచి.. అక్కడి నుంచి వెళ్ళారు. శ్రీకాంత్ గాయాలతో నేలపై కూర్చొని, ఉక్రోషంగా చూస్తూ కనిపించారు.
టీజర్‌లో ఒక డైలాగ్ కూడా లేదు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారట. ఈ ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ టీజర్ 'ఆపరేషన్ దుర్యోధన' సినిమాను గుర్తు చేసింది.
శ్రీకాంత్ సినీ కెరీర్‌లోనే ఆ చిత్రం ఓ మైలురాయిగా నిలిచింది. వేసవిలో 'ఆపరేషన్ 2019'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. 'రా రా' అనే కామెడీ హారర్ తర్వాత శ్రీకాంత్ నటిస్తు్న్న సినిమా ఇది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







