ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో సౌదీ మహిళా న్యాయవాదులు
- January 27, 2018_1517041042.jpg)
రియాద్ : చట్టాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రిన్స్ సుల్తాన్ యూనివర్సిటీ (పి ఎస్ యు) స్కూల్ ఆఫ్ లా కు చెందిన మహిళా న్యాయవాదులకు అమెరికన్ బార్ అసోసియేషన్ ఒక వినూత్న చట్టబద్దమైన శిక్షణా కార్యక్రమాన్ని సౌదీ అరేబియాలో నిర్వహించింది. లా స్కూల్ ఆఫ్ ముఖ్యఅధిపతి ఇబ్రహీం అల్-హుదైథీ మాట్లాడుతూ, 25 మంది మహిళల న్యాయవాదులు ,యూనివర్సిటీ నుండి శిక్షణ పొందతున్నావారు నల్గురు అమెరికన్ న్యాయవాదుల ఉపన్యాసాలకు హాజరయ్యారు."సౌదీ అరేబియాలోమహిళా చట్టాల్లోని గ్రాడ్యుయేట్లు మరియు ట్రైయినీలకు ఈ రకమైన చట్టబద్దమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడటం ఇదే మొదటిసారి" అని ఆయన చెప్పారు.నాలుగు వారాల శిక్షణా కార్యక్రమం వచ్చేనెల ఫిబ్రవరి 15 న ముగుస్తుంది, ఈ శిక్షణ మొత్తం ఇంగ్లీష్ లో ఇవ్వబడుతుంది. రాజ్యంలో పలువురు న్యాయవాదుల ఈ శిక్షణా కార్యక్రమం పట్ల ఆసక్తిని కనబర్చారు. యునైటెడ్ కింగ్డమ్ లోని డర్హామ్ యూనివర్సిటీ నుండి తన డాక్టరేట్ డిగ్రీని పొందిన అల్-హుదైథీ, ప్రిన్స్ సుల్తాన్ యూనివర్సిటీ (పి ఎస్ యు) స్కూల్ ఆఫ్ లా, ఈ రకమైన శిక్షణను తన మహిళా గ్రాడ్యుయేట్లకు అందించే మొట్టమొదటి విద్యా సంస్థగా పేర్కొంది. రియాద్ లో జరిగిన న్యాయ శిక్షణా తరగతుల గది నుండి పొందబడిన చట్టం యొక్క పరిజ్ఞానాన్ని అలాగే వారి ప్రాక్టీస్ ను మెరుగుపరుస్తుంది, తద్వారా వారు భవిష్యత్తులో మంచి న్యాయవాదులు లేదా చట్టంలోని సంగతులు తెల్సినవారిగా పరిణితి చెందుతారని అవుతారని చెప్పింది. వాస్తవానికి, చట్టబద్దమైనవృత్తిలో విజయవంతం కావాలనుకుంటే, ట్రైన్స్ చేత చేయవలసిన వాటిలో ఒకటి మాత్రమే. వారు సాధారణ అభ్యాసకులుగా ఉండాలని భావిస్తే, వారు న్యాయ సెమినార్లకు శిక్షణాలకు సైతం హాజరు కావాలి, అక్కడ వారు కార్పొరేట్ మరియు ప్రభుత్వంలోని వివిధ శాఖలలో తాజా ధోరణులను తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు