దయాకర్‌ 2 లక్షల 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో

- November 23, 2015 , by Maagulf
దయాకర్‌ 2 లక్షల 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో

తొమ్మిదో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్‌ 2 లక్షల 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో టిఆఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ కాంగ్రెసు అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 45 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ తొలి రౌండు‌లో ఏడు వేల ఆధిక్యత సాధించారు. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెసు అభ్యర్థి సర్వే సత్యనారాయణకు నాలుగు ఓట్లు వచ్చాయి. తొలి రౌండులోనే టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 15 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. భారీ సాయుధ పోలీసుల పహరా మధ్య వరంగల్‌లోని ఎనుమాముల మార్కెటులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఒక్కో అసెంబ్లీ పరిధిలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విడివిడిగా రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో ఉదయం 8గంటలకు ముందుగా వాటిని లెక్కిస్తున్నారు. దీని అనంతరం ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను నియోజకవర్గాల కౌంటింగ్‌ కేంద్రాలకు స్ట్రాంగ్ రూంల నుంచి తరలిస్తారు. లెక్కింపు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం సిబ్బందితో ఒకసారి మాక్‌ కౌంటింగ్‌ను కూడా అధికారులు పూర్తి చేశారు. శనివారంనాడు పోలింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పసునూరు దయాకర్, కాంగ్రెసు తరఫున సర్వే సత్యనారాయణ, బిజెపి - తెలుగుదేశం కూటమి తరఫున దేవయ్య బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com