దయాకర్ 2 లక్షల 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో
- November 23, 2015
తొమ్మిదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ 2 లక్షల 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో టిఆఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ కాంగ్రెసు అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 45 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ తొలి రౌండులో ఏడు వేల ఆధిక్యత సాధించారు. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెసు అభ్యర్థి సర్వే సత్యనారాయణకు నాలుగు ఓట్లు వచ్చాయి. తొలి రౌండులోనే టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 15 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. భారీ సాయుధ పోలీసుల పహరా మధ్య వరంగల్‌లోని ఎనుమాముల మార్కెటులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఒక్కో అసెంబ్లీ పరిధిలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విడివిడిగా రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. వరంగల్ ఉప ఎన్నిక ఫలితాల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఉదయం 8గంటలకు ముందుగా వాటిని లెక్కిస్తున్నారు. దీని అనంతరం ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలకు స్ట్రాంగ్ రూంల నుంచి తరలిస్తారు. లెక్కింపు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం సిబ్బందితో ఒకసారి మాక్ కౌంటింగ్‌ను కూడా అధికారులు పూర్తి చేశారు. శనివారంనాడు పోలింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పసునూరు దయాకర్, కాంగ్రెసు తరఫున సర్వే సత్యనారాయణ, బిజెపి - తెలుగుదేశం కూటమి తరఫున దేవయ్య బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







