ఆధిక్యంలో తెరాస అభ్యర్థి దయాకర్
- November 23, 2015
వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ ప్రత్యర్థులకు అందనంత భారీ అధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 2,90,779 ఓట్ల ఆధిక్యంలో దయాకర్ ఉన్నారు తొలి నుంచి అన్ని రౌండ్లలోనూ దయాకర్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నం 2గంటల కల్లా తుది ఫలితం వెలువడే అవకాశముంది. వరంగల్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కరుణ, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







