గో హెరిటేజ్‌ వాక్‌ ఇన్ హంపీ

- January 28, 2018 , by Maagulf
గో హెరిటేజ్‌ వాక్‌ ఇన్ హంపీ

హొసపేటె: విదేశీ పర్యాటకులు హంపీలో ఆదివారం హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమం చేపట్టారు. గో హెరిటేజ్‌ వాక్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, న్యూజీలాండ్‌ తదితర దేశాల నుంచి వచ్చిన సుమారు 15 మంది పర్యాటకులు, బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాలకు చెందిన స్వదేశీ సందర్శకులతో కలిసి హెరిటేజ్‌ వాక్‌లో పాల్గొన్నారు. హంపీలోని ఎదురు బసవణ్ణ మంటపంవద్ద ప్రారంభమైన నడక ప్రారంభించి విజయ విఠల దేవస్థానం, మహానవమి దిబ్బ, జలమంటపం, గజ్జల మంటపం, ఉగ్ర నరసింహ, లోటస్‌ మహల్, గజశాల తదితర పురాతన స్మారకాల మీదుగా 21 కి.మీ.ల మేర వరకు కొనసాగించారు. ఈసందర్భంగా ఇంగ్లండ్‌కు చెందిన జోనస్‌ ఎలిజబెత్‌ మాట్లాడుతూ పర్యాటక కేంద్రమైన హంపీలో హెరిటేజ్‌ వాక్‌ చేపట్టడం ద్వారా పురాతన స్మారకాల సంరక్షణపై అవగాహన కల్పించామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com