బీఎస్‌ఎన్‌ఎల్: సండే ఉచిత కాల్స్‌కు గుడ్‌బై

- January 28, 2018 , by Maagulf
బీఎస్‌ఎన్‌ఎల్: సండే ఉచిత కాల్స్‌కు గుడ్‌బై

కోల్‌కతా : ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్).. వచ్చే నెల 1 నుంచి ఉచిత సండే కాల్స్‌కు గుడ్‌బై చెప్పనున్నది. దేశవ్యాప్తంగా ఆదివారాల్లో ల్యాండ్‌లైన్ కస్టమర్లకు అందిస్తున్న ఉచిత వాయిస్ కాల్స్ సదుపాయాన్ని ఇక నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రీ నైట్ కాలింగ్ ప్రయోజనాలను ఆపేయాలన్న నిర్ణయంలో భాగంగానే ఈ మేరకు ప్రకటన వచ్చింది. కాగా, మరికొన్ని కొత్త ప్లాన్లను ఆలోచిస్తున్నామని కోల్‌కతా టెలీఫోన్స్ (కాల్‌టెల్) చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్‌పీ త్రిపాఠి పీటీఐకి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com